ఉన్నట్లుండి ఆ రాష్ట్రానికి ఏమైంది? సీన్ ఒక్కసారిగా మారిందే

By సుభాష్  Published on  16 July 2020 6:12 AM GMT
ఉన్నట్లుండి ఆ రాష్ట్రానికి ఏమైంది? సీన్ ఒక్కసారిగా మారిందే

దేశంలోని మిగిలిన రాష్ట్రాల సంగతి వేరు. కేరళ రాష్ట్రం వ్యవహారం వేరు. దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది ఆ రాష్ట్రంలోనే. ఆ మాటకు వస్తే.. దేశంలోని పలు రాష్ట్రాలకు కరోనా సంగతి అంత బాగా తెలీని సమయంలోనే కేరళలో కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే.. మిగిలిన వారికి భిన్నంగా కరోనా కేసుల్ని కంట్రోల్ చేయటంలో ఆ రాష్ట్రం సక్సెస్ అయ్యిందన్న మాట వినిపించింది. అంతేకాదు.. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేరళకు తమ టీంలను పంపి.. వైరస్ కు చెక్ పెట్టేందుకు ఆ రాష్ట్రం అనుసరించిన విధానాలు ఏమిటన్న దానిపై అధ్యయనం చేయించిన వైనాల్ని చూసిందే.

దేశం మొత్తం పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్నా.. కేరళలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. కేరళ కంటే ఎంతో వెనగ్గా పాజిటివ్ కేసులు నమోదైన పలు రాష్ట్రాలు తర్వాతి కాలంలో వేలల్లో కేసులు నమోదయ్యే పరిస్థితి. ఏపీ అందుకు పెద్ద ఉదాహరణ. ఇటీవల కాలంలోనూ కేరళలో రోజుకు ఆరేడుకు మించి కొత్త కేసులు నమోదు కాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఉన్నట్లుండి ఆ రాష్ట్రంలో సీన్ మారింది. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అదిప్పుడు రోజుకు ఆరు వందలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నారు. దీంతో.. ఆ రాష్ట్ర అధికారులకు ఏం చేయాలో తోచని పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల కంటే ముందే.. ఆన్ లాక్ ను అమలు చేస్తూనే.. లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం కంప్లీట్ గా బంద్ చేయటంతోపాటు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా నమోదైన కేసులతో కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9553కు పెరిగింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులు రూ.4880. గడిచిన 24 గంటల్లో కేరళలో 16,444 శాంపిల్స్ సేకరిస్తే.. 623 కేసులు కొత్తగా నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోనే157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య తగ్గకపోగా.. పెరగటంపైన అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Next Story
Share it