భారీ స్కోర్‌ సాధించిన ఇంగ్లాండ్‌.. కీమర్‌ రోచ్ అరుదైన ఘనత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2020 2:30 PM GMT
భారీ స్కోర్‌ సాధించిన ఇంగ్లాండ్‌.. కీమర్‌ రోచ్ అరుదైన ఘనత

మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అతిధ్య ఇంగ్లాండ్‌ జట్లు భారీ స్కోర్‌ సాధించింది. తొలి ఇన్సింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 258/4 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఇంగ్లాండ్‌ను ఆదుకున్న ఓలీ పోప్‌(91) రెండో రోజు ఒక్క పరుగు కూడా జోడించకుండానే పెవిలియన్‌ చేరాడు. బట్లర్‌ (67), వోక్స్‌(1), జోప్రా అర్చర్‌(3) వెంట వెంటనే ఔట్‌ కావడంతో.. ఇంగ్లాండ్‌ 280 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్గాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సువర్ట్‌ బ్రాడ్‌ విజృంభించి ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 45 బంతుల్లో 9 పోర్లు, 1సిక్సర్‌ బాది 62 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. విండీస్ పేసర్లలో రోచ్ నాలుగు వికెట్లు తీయగా.. గాబ్రియేల్, ఛేజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒక వికెట్ తీశాడు.

26ఏళ్ల తరువాత ఆ ఘనత..

నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. క్రిస్ ‌వోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా రోచ్‌ విండీస్‌ తరుపున ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 26 ఏళ్లలో 200 టెస్టు వికెట్ల మైలురాయిని అధిగమించిన తొలి విండీస్‌ బౌలర్‌గా కీమర్‌ రోచ్‌ రికార్డు సృష్టించాడు. చివరగా 1994లో ఆంబ్రోస్‌ ఈ ఘనత అందుకున్నాడు.

ఈ సందర్భంగా నాటి బౌలర్‌ ఆంబ్రోస్‌.. ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని రోచ్‌కు పంపాడు. ఐసీసీ ట్విట్టర్‌లో పంచుకున్న ఆ వీడియోలో రోచ్‌ ఇలాగే కొనసాగుతూ ముందుకు సాగుతూ.. 250, 300వికెట్లు తీయాలని ఆకాంక్షించాడు. రోచ్‌ 59 టెస్టుల్లోనే 200 టెస్టు వికెట్లు సాధించగా.. మాల్కం మార్షల్ (42), జోయెల్ గార్నర్ (44), కర్ట్లీ అంబ్రోస్ (45), లాన్స్ గిబ్స్ / ఆండీ రాబర్ట్స్ (46), మైఖేల్ హోల్డింగ్ (47), కోర్ట్నీ వాల్ష్ (58) అతని కన్నా ముందు ఉన్నారు. గ్యారీ సోబర్స్ 80 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.



ఇరు జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో పాయింట్లను పెంచుకోవాలని అటు ఇంగ్లాండ్, ఇటు విండీస్ జట్లు ప్రయత్నిస్తున్నాయి.

Next Story