'మిస్‌ ఇండియా' కీర్తి సురేష్‌ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌..

By అంజి  Published on  10 Feb 2020 11:24 AM GMT
మిస్‌ ఇండియా కీర్తి సురేష్‌ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌..

'మహానటి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌. ఆ చిత్రం తీసుకువచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు కీర్తి సురేష్‌ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో పాటు కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ ప్రధానపాత్రలో 'మిస్‌ ఇండియా' అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, భానుశ్రీ మెహ్రా, నరేష్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 'కొత్తగా కొత్తగా కొత్తగా రంగేలే నింగిలో' అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. కల్యాణ్‌ చక్రవరి రాసిన లిరిక్స్‌కు థమన్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేశారు. ఈ సాంగ్‌ను సింగర్‌ శ్రేయా ఘోషాల్‌ అద్భుతంగా ఆలపించారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు 'మిస్‌ ఇండియా'ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా నరేంద్ర పరిచయం అవుతున్నాడు. మిస్‌ ఇండియా సినిమా మార్చిలో విడుదల కానుంది.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్‌ కీర్తి సురేష్‌ మొక్కలు నాటారు. సూరరంలోని టెక్‌ మహీంద్రా కాలేజీ ఆవరణలో ఆదివారం నాడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ మంచి కార్యక్రమమని అన్నారు.

 Keerthy sureshs Miss india Movie

Next Story
Share it