కీర్తి క్రైం కథా చిత్రం..!!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 6:46 AM GMT
కీర్తి క్రైం కథా చిత్రం..!!!

నవ మాసాలు మోసి,పెంచి పోషించిన కన్న తల్లి ని, తన ప్రియుడు తో కలిసి అతి దారుణంగా చంపింది కసాయి కూతురు. తల్లి శవాన్ని పక్కన పెట్టి మరీ తన బాయ్ ఫ్రెండ్స్ తో కులికింది..ఇక తన పై ఎలాంటి అనుమానం రాకుండా ప్రియుడు తో కలిసి శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా రైల్వే పట్టాల మీద పడేసింది. కొత్త డ్రామా ఆడి పోలీసులకు అడ్డంగా దొరికింది.. సినిమా ను తలపించేలా అనేక ట్విస్ట్ లు ఉన్న క్రైమ్ కిల్లర్ స్టొరీ ఏంటో ఒకసారి చూద్దాం.

కన్నా కూతురే తల్లిని చంపినా హృదయ విదారక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో పదేళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. హయత్‌నగర్ పరిధిలోని ద్వారకా సాయి నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్ 4లో సొంతిల్లు కట్టుకున్నాడు. ఒకే ఒక్క కూతురు కావడంతో కీర్తిని కాస్తా గారాబంగా పెంచారు. ప్రస్తుతం ఆమె దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతుంది.ఇక్కడ వరకు బాగానే ఉంది. కీర్తి వేసిన తప్పటడుగు ఆ కుటుంబానికి అప కీర్తి తెచ్చి పెట్టింది.

తన తల్లి రజిత కనిపించడం లేదని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూతురు కీర్తి రెడ్డి ఫిర్యాదు చేసింది ..అయితే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇక్కడే పోలీసులు ఊహించని ట్విస్ట్ బయట పడింది .మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా మారిపోయింది . రజిత ను కన్న కూతురు కీర్తి నే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.తన ప్రియుడు శశి తో కలిసి హత్య చేసి దృశ్యం సినిమా ను తలపించేలా చేశారు అంటున్నారు పోలీసులు.

కీర్తి మైనర్ గా ఉన్న సమయం లో అదే కాలనీకి చెందిన బాల్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమ మారింది..ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి గర్భం దాల్చే వరకు వెళ్ళింది.అయితే ..పరువు పోతుందని తెలిసిన బాల్ రెడ్డి తనకు స్నేహితుడైన శశి సహాయం తో మహబూబ్ నగర్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి లో కీర్తి కి అబార్షన్ చేయించాడు.ఆ తరువాత కీర్తి , బాల్ రెడ్డి కొంత కాలం దూరంగా అయ్యారు.ఇదే అదును అనుకున్న బాల్ రెడ్డి స్నేహితుడు శశి , కీర్తిని ట్రాప్ చేశాడు. తనను ప్రేమించాలని , శారీరకంగా కలవాలని వేధించాడు.లేదంటే అబార్షన్ విషయం మీ తల్లికి చెపుతానంటూ బెదిరించాడు.దీంతో కీర్తికి అబార్షన్ చేయించిన విషయాన్ని శశి కుమార్ అస్త్రంగా వాడుకున్నాడని పోలీస్ అధికారి మహేష్ భగవత్ చెప్పారు.

కీర్తి కి పెళ్లి చేయాలనీ ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. బాల్ రెడ్డి తో ఉన్న పరిచయం తెలిసి అతనికి కీర్తి ని ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న శశి తనకు కీర్తి దూరం అవుతుందనే ఆలోచనలో పడే పోయాడు. కీర్తిని పెళ్లి చేసుకుంటే... ఇల్లు, 9 ఎకరాలు పొలం, డబ్బుకు డబ్బు స్థిర పడిపోవచ్చు అనుకున్నాడు శశి. ఈ ఆలోచనతోనే బాల్ రెడ్డిని పెళ్లి చేసుకోవద్దని కీర్తిపై ఒత్తిడి తెచ్చాడు శశి. ఒకేవేళ తన మాట వినకుండా బాల్ రెడ్డి ని పెళ్లి చేసుకుంటే ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరింపులకు దిగాడు. దిక్కు తోచని పరిస్థితుల్లో , తన పరువు , కుటుంబ పరువు తీస్తాడేమో అనే భయం తో శశి తో కలిసి ఉండటానికి అంగీకరించింది కీర్తి . అయితే ఈ విషయం ఇంట్లో తెలిసి , తల్లి రజిత మందలించింది . తన ప్రేమ కి కీర్తి తల్లి అడ్డుగా ఉందని భావించి , దృశ్యం సినిమా పార్టీ 2 కి ప్లాన్ చేశాడు శశి.

పథకం ప్రకారమే నిద్ర మాత్రలు ఇచ్చి చంపాలని చూశారు. మరి ఆ ప్లాన్ అనుకున్నంత వర్క్ అవుట్ కాలేదు. అక్టోబర్‌ 19న ఎలాగైనా రజితను చంపేయాలని డిసైడ్ అయ్యారు. రజిత ఒక్కతే ఇంట్లో ఉండటం గమనించారు. కీర్తి తో రజిత పై కంట్లో కారం చల్లేలా చేశాడు శశి ..అదే సమయంలో అనుకున్న ప్లాన్ ప్రకారం మద్యం సేవించి ఇంట్లోకి వచ్చిన శశి కుమార్, టవల్ తో రజిత గొంతు నులిమి హత్య చేశారు.రజిత కింద పడిపోగానే.. తల్లి మీద కు ఎక్కి కూర్చొని గొంతు నులిమింది కీర్తి. రజిత చనిపోయిన తర్వాత, మృతదేహాన్ని బెడ్రూం వరకు ఈడ్చు కెళ్ళి భద్ర పరిచారు.కీర్తి ధైర్యంగా ఉండడం కోసం హత్య తరువాత శశి , కీర్తి కూడా మద్యం ఇచ్చాడు. ఆ తరువాత మూడు రోజులు పాటు మృత దేహం తోనే ఇంట్లో శశి , కీర్తి గడిపారు. ఆ తరువాత మృత దేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా యాదాద్రి జిల్లా రామన్న పేట్ రైల్ పట్టాలు దగ్గర పడేశారు. తిరిగి హైదరాబాద్ కు శశి , కీర్తి తమ కారు లోనే చేరుకున్నారు.

తల్లిని రైలు పట్టాలపై పడేసి ఇంటికి వచ్చిన తరువాత బాల్ రెడ్డి తండ్రికి కాల్ చేసింది కీర్తి. తన తల్లి వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ..నేను వైజాగ్ వెళ్తున్నాను..అమ్మాయిని బాగా చూసుకోండని చెప్పింది. ప్తాన్ ప్రకారం కీర్తి బాల్ రెడ్డి ఇంట్లో ఉంది.

అయితే.. కీర్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి డ్యూటీ దిగి రాగానే , కీర్తికి ఫోన్ చేసి రజిత కనపడలేదని తెలిపాడు.దీంతో కీర్తినే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టింది. మా నాన్న తరుచు మా అమ్మ తో గొడవ పడుతుండేవాడు దీంతో మా అమ్మ ఇంట్లో నుండి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసింది.అయితే.. తన కూతురుపైనే అనుమానము ఉందని శ్రీనివాస రెడ్డి చెప్పడం తో పోలీసులు తమ దైన శైలి లో విచారణ చేశారు. తీగ కదలడం మొదలైంది. కీర్తి నోట్లోంచి సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Next Story