ఛాలెంజ్‌ పూర్తిచేసిన కొర‌టాల, కీర‌వాణి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2020 7:12 PM IST
ఛాలెంజ్‌ పూర్తిచేసిన కొర‌టాల, కీర‌వాణి

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. లాక్‌డౌన్‌ స‌మ‌యంలో ఇంటి ప‌నుల్లో భార్య‌ల‌కు స‌హాయం చేయాల‌ని ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ 'బీ ది రియ‌ల్ మేన్' ఛాలెంజ్ ను మొద‌లు పెట్టాడు. ఇప్ప‌టికే ఈ ఛాలెంజ్‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌లు పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స్వీక‌రించాడు. అనంత‌రం కొద్ది సేప‌టి క్రిత‌మే.. వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. ఇక వీడియోలో కొర‌టాల గిన్నెలు క‌డుగుతూ.. ఇల్లు తుడుస్తూ క‌నిపించాడు. 'ఇంటి ప‌ని మొద‌ట్లో కాస్త క‌ష్టం అనిపించ‌వచ్చు.. కానీ రాను రాను అల‌వాటు అయిపోయి ఇప్పుడు స‌ర‌దాగా అయ్యిందంటూ' రాసుకొచ్చాడు. ఈ ఛాలెంజ్‌కు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరును నామినేష‌న్ చేశాడు.



ఇక ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విసిరిన ఛాలెంజ్‌ను కీర‌వాణి పూర్తి చేశాడు. ఉతికిన బ‌ట్ట‌లు ఆరేస్తూ.. తువాళ్ల‌ను మ‌డ‌త పెడుతూ, మొక్క‌ల‌కు నీళ్లు పోసి, డైనింగ్ టేబుల్ ను తుడిచాడు. ఈ ప‌నుల‌న్నింటికి బ్యాగ్రౌండ్‌లో సై సినిమాలో తాను కంపోజ్ చేసిన అప్పుడ‌ప్పుడు అప్పుడ‌ప్పుడు ఇలాగా అనే పాటను జ‌త చేశాడు. నా ప‌నిని పూర్తి అయ్యింది అంటూ.. ద‌ర్శ‌కుడు క్రిష్‌తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌ను నామినేట్ చేశాడు.



Next Story