'కేఈ' కేబుల్ నెట్‌వర్క్‌పై పోలీసుల దాడులు
By Medi Samrat Published on 3 Nov 2019 12:39 PM ISTముఖ్యాంశాలు
- కేఈ కృష్ణమూర్తి సంస్థపై దాడులు
- మహాలక్ష్మి కేబుల్ నెట్‌వర్క్ అండ్ కమ్యూనికేషన్ సీజ్
కర్నూలు : టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చెందిన మహాలక్ష్మి కేబుల్ నెట్‌వర్క్ అండ్ కమ్యూనికేషన్ సంస్థలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లోకల్ ఛానల్ గా ఉన్న ఈ సంస్థ శాటిలైట్ ప్రసారాలకు సంబంధించి కాఫీరైట్ వివాదం దృష్ట్యా ఈ దాడులు జరిగినట్టు సమాచారం. ఈ దాడులలో 7 హార్డ్‌డిస్కులు, సీపీయూలను పోలీసులు సీజ్ చేశారు. ఈ దాడులలో పోలీసులతో పాటు కాపీరైట్ సేప్టీ సిస్టం ఎండీ చలపతి రాజు కూడా పాల్గొన్నారు. వివాదం దృష్ట్యా ఛానల్ ను స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిపారు.
Next Story