నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
By సుభాష్ Published on 8 Jun 2020 12:05 PM IST
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పదో తరగతి పరీక్షలను రంగారెడ్డి, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు వెల్లడించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మినహాయించి మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో రోజు జరిగే సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సాయంత్రం 4.30 గంటలకు అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదవుతున్న కరోనా కేసుల విషయమై చర్చించనున్నారు.
Next Story