సీఎం కేసీఆర్‌ కుటుంబంలో విషాదం

By సుభాష్  Published on  8 Feb 2020 12:31 PM GMT
సీఎం కేసీఆర్‌ కుటుంబంలో విషాదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్‌ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరరావు (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఓల్డ్‌ అల్వాల్‌ మంగాపురిలో రాజేశ్వరరావు పార్థివదేహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం కటుంబీకులను కేసీఆర్‌ ఓదార్చారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు ఓల్డ్‌ అల్వాల్‌లో రాజేశ్వరరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేశ్వరరావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మర్రిమడ్ల గ్రామం. రాజేశ్వరరావు మరణించారని తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుపక్కల వారు భారీగా తరలివచ్చారు. కాగా, కేసీఆర్‌ రెండో సోదరి విమలాబాయి కూడా 2018 ఫిబ్రవరి అనారోగ్యంతో మరణించారు.

Kcr Siste Husband

Next Story
Share it