వైద్యుల నిర్లక్ష్యమే సీఎం పెంపుడు కుక్క చావుకు కారణం..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2019 10:32 AM GMT
వైద్యుల నిర్లక్ష్యమే సీఎం పెంపుడు కుక్క చావుకు కారణం..?!

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ఓ కుక్క చనిపోయిన సంఘటనపై సంబంధిత పశు వైద్యునిపై క్రిమినల్ కేసు దాఖలైంది. ఈ తాజా సంఘటనపై తెలంగాణ బీజేపీ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదం అని కాషాయ పార్టీ నేతలు విమర్శించారు.

ప్రగతి భవన్ వద్ద సెప్టెంబర్ 11 న పశువైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే 11 నెలల కుక్క హస్కీ మరణించింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించి పశువైద్య వైద్యుడిపై కేసు నమోదు చేశారు. ప్రగతి భవన్ వద్ద ఉన్న తొమ్మిది పెంపుడు కుక్కలలో ఒకటైన హస్కీ సెప్టెంబర్ 10 న అనారోగ్యానికి గురయ్యింది. ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ కుక్క చనిపోడానికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ పశువైద్యునిపై కేసు నమోదు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలను బిజెపి సందిస్తోంది.

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి తీవ్రమైన విషజ్వరాలతో వేల మంది బాధ పడుతున్నారన్నారు. వీరికి సరైన వైద్యం అందేలా చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమవుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Next Story