సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.!

By సుభాష్  Published on  28 April 2020 7:56 AM IST
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.!

తెలంగాణలో కరోనా వైరస్ కాలరాస్తోంది. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక సీజనల్ వ్యాధుల కోసం మున్సిపాలిటీలలో ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ తర్వాత కూడా పట్టణాల్లో కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 1500 కోట్లతో కొత్త రోడ్లను వేయనున్నారు. కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతు పనులు సాగుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. అయితే సీజన్‌ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం.

కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1003 కరోనా పాజిటివ్ కేసులుండగా, సోమవారం 2 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక 316 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక కరోనాతో 25 మంది చెందారు.

కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ..పలు ఆదేశాలు, సూచనలు అందజేశారు. పకడ్బంది చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మే 3వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ విధించగా, తెలంగాణ రాష్ట్రంలో మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story