ఆశల పల్లకిలో..
By సుభాష్
ముఖ్యాంశాలు
► మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు
► మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారా.?
► వచ్చే మంత్రివర్గ విస్తరణలో సుమన్‌కు చోటు దక్కుతుందా..?
►సుమన్‌కు మంత్రి పదవి ఖాయమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు
మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సారి బాల్క సుమన్‌కు మంత్రి పదవి తప్పకుండా వరిస్తుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. బాల్క సుమన్ కేసీఆర్, కేటీఆర్‌లతో మంచి సంబంధాలు ఉండడమే కాకుండా కుటుంబ సభ్యుడిగా పార్టీ నేతలు చూస్తుంటారు. అంతేకాకుండా మంత్రి పదవి కోసం బాల్క సుమన్ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకు ఫలితంగా మంత్రి పదవి గ్యారంటి అని వినిపిస్తోంది. కాగా, ఇటీవల తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో సుమన్‌కు మంత్రి పదవి దక్కాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయినట్లు నేతలు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ కీలక పాత్ర
ఇక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగం నేతగా బాల్క సుమన్ కీలక పాత్ర పోషించారు. ఉద్యమం సందర్భంగా కేసీఆర్ దృష్టిలో పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బాల్క సుమన్‌కు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌పై సుమన్ ఘన విజయం సాధించారు.
2018లో ఎమ్మెల్యేగా టికెట్..
ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో బాల్క సుమన్‌కు కేసీఆర్ చెన్నూరు టికెట్ ఇచ్చారు. అక్కడ సీనియర్ నేత నల్లాల ఓదేలు ఉన్నప్పటికీ ఆయనను కాదని సుమన్ టికెట్ కేటాయించారు కేసీఆర్. అక్కడ కూడా మంచి మెజార్టీతో గెలుపొందారు. అంతేకాదు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన నియోజకవర్గం పరిధిలో స్వీప్ చేసేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రమే మంత్రిగా ఉన్నారు. పెద్ద జిల్లా కావడంతో మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. దీంతో సుమన్‌కు మంత్రి పదవి కట్టబెట్టి మంత్రివర్గంలో తీసుకురావాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాల్క సుమన్‌కు మంత్రి పదవి వరిస్తుందా..? లేదా అన్ని వేచి చూడాల్సిందే.