తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ పోర్టల్‌ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దేశంలో తొలిసారిగా విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్‌ రూపకల్పన జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.