చంద్రబాబు , పవన్ కల్యాణ్ వేరువేరు కాదు..ఒక్కరే..!- ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 4:07 PM IST
చంద్రబాబు , పవన్ కల్యాణ్ వేరువేరు కాదు..ఒక్కరే..!- ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

హైదరాబాద్‌ : మాజీ సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడింది ఏంలేదన్నారు వైఎస్ఆర్‌ సీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయన అనుభవం రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందన్నారు. ఇక..చంద్రబాబు బాటలోనే పవన్ కల్యాణ్ నడిస్తే ప్రజలు విశ్వసించరన్నారు. మీడియా మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ఉద్దండుడని చెప్పారు. వచ్చిన మూడు నెలలకే సీఎం వైఎస్ జగన్ లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటోన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి న్యూస్ మీటర్ స్పెషల్ ఇంటర్వ్యూ.

Next Story