టెస్టు క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ త‌రువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భార‌త ఆట‌గాడు క‌రుణ్ నాయ‌ర్‌. ఈ యువ క్రికెట‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు. ఉదయ్‌పూర్‌లో త‌న ప్రేయ‌సి సనయ టాంకరివాలాతో కరుణ్‌ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. వీరిద్ద‌రూ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉండ‌గా వీరిద్ద‌రి పెళ్లికి కుటుంబ స‌భ్యులు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.Karunshanaya1

దీంతో శ‌నివారం రాత్రి వీరిద్ద‌రూ వివాహా బంధంతో ఒక్క‌టైయ్యారు. ఈ జంట‌కు టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌తో పాటు పలువురు క్రికెట‌ర్లు శుభాకాంక్షలు తెలిపారు. 18 01 2020 Karunshanaya 19946963 154442599ఇక టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ వ‌రుణ్ అరోన్ వివాహానికి హాజ‌రైన‌ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.