ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్
By Newsmeter.NetworkPublished on : 19 Jan 2020 1:18 PM IST

టెస్టు క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడు కరుణ్ నాయర్. ఈ యువ క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు. ఉదయ్‌పూర్‌లో తన ప్రేయసి సనయ టాంకరివాలాతో కరుణ్ వివాహం ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉండగా వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో శనివారం రాత్రి వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటైయ్యారు. ఈ జంటకు టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ వివాహానికి హాజరైన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
Next Story