కర్నాటక బంద్‌.. బస్సులపై రాళ్లతో దాడి..

By అంజి  Published on  13 Feb 2020 7:08 AM GMT
కర్నాటక బంద్‌.. బస్సులపై రాళ్లతో దాడి..

కర్నాటకలో బంద్ కొనసాగుతోంది. డాక్టర్‌ సరోజిని మహిషి నివేదికను అమలు చేయాలని.. ఆ రాష్ట్రానికి చెందిన పలు సంఘాలు రోడ్డెక్కాయి. కన్నడిగులకు పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాల కల్పనను నెరవేర్చాలంటూ ధర్నాలకు దిగారు. స్థానికులకు ఉద్యోగాల్లో కోటా కల్పించాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. గురువారం ఉదయం బెంగళూరులోని జంక్షన్లు, బస్టాండ్ల వద్ద వందల మంది నిరసన తెలియజేస్తున్నారు. బంద్‌కు మద్దతు తెలపాలంటూ.. ప్రజలు, సిబ్బందిని సంఘాలు కోరుతున్నాయి.

పక్కరాష్ట్రాలకు చెందిన బస్సులపై నిరసన కారులు రాళ్లు రువ్వారు. దీంతో కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను పోలీసులు అదుపు చేస్తున్నారు. ఫరంగిపేట వద్ద తిరుపతి నుంచి మంగళూరు వెళ్తున్న బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ బస్సు ధ్వంసమైంది. బెంగళూరుతో పాటు పలు ప్రధాన పట్టణాల్లో జనజీవన కార్యకలాపాలు ఆగిపోయాయి. బంద్‌కు ఓలా, ఊబర్‌ డ్రైవర్లు మద్దతు తెలిపారు. బంద్‌ మేరకు బెంగళూరు వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్‌ మార్పు చేసింది.



పలు రాజకీయ పార్టీలు, కన్నడ సంఘాలు.. ఒక్కూట పేరు ఇవాళ కర్నాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. 1983లో అప్పటి ప్రభుత్వం ఏర్పాట చేసిన కమిటీలో ఉద్యోగాల రిజర్వేషన్‌ విషయమై సరోజిని బిందురావ్‌ మహిషి పలు కీలక అంశాలు ప్రతిపాదించారు. సరోజినీ బిందురావ్ మహిషి1963 నుంచి 1980 వరకూ కర్నాటక ధావాడ నుంచి జనతా పార్టీ నేతగా ఉన్నారు. ఆ నివేదిక ప్రకారం ఉద్యోగాల విషయంలో తమకు సరైన న్యాయం జరగడం లేదని కన్నడిగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా కర్నాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇవాళ, రేపు బంద్‌కు పిలుపునిచ్చారు.

Next Story