ఎమ్మెల్యేల నివాసాల్లో మీడియాపై నిషేధం.. జర్నలిస్టుల ఆందోళన

By అంజి  Published on  22 Feb 2020 3:28 PM GMT
ఎమ్మెల్యేల నివాసాల్లో మీడియాపై నిషేధం.. జర్నలిస్టుల ఆందోళన

బెంగళూరు: కర్నాటక శాసన సభ స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల నివాసల ఆవరణలో మీడియాపై నిషేధం విధించారు. ఇందుకు సంబంధించి స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్దే నోటీసులు కూడా జారీ చేశారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియతో పాటు కెమెరామెన్లను కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి అనుమతించమని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల నుంచి శాసన సభకు వస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు వారికి ప్రభుత్వం కేటాయించిన నివాసాల్లోకి వెళ్తారు. ఎమ్మెల్యేలకు పూర్తిగా ప్రైవేట్‌ సమయం ఇది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే నివాసాల్లోకి మీడియా వెళ్లకూడదని స్పీకర్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ ముందు.. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు జర్నలిస్టులను ఏర్పాటు చేశామని స్పీకర్‌ కార్యాలయం వెల్లడించింది.

కాగా హౌస్‌ ప్రోసిడింగ్స్‌ను ప్రసారం చేయకుండా మీడియాను నిషేధించాలన్న స్పీకర్‌ నిర్ణయాన్ని జర్నలిస్టులు, కెమెరామన్లు ఖండించారు. దీనిపై కర్నాటకలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ విషయమై స్పీకర్‌తో మాట్లాడుతానని.. ఈ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ఒప్పించుకోడానికి సీఎం బీఎస్‌ యాడియూరప్ప తెలిపారు.

Karnataka Assembly Speaker

Next Story