మహిళా ఉద్యోగులపై వీఆర్వో నిర్వాకం..
By రాణి Published on 23 April 2020 1:58 PM IST- ఎండీఓ కు ఫిర్యాదు
- వీఆర్వోను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్
మహిళా ఉద్యోగులను అసభ్య పదజాలంతో తిట్టిన వీఆర్వోఓను వెంటనే సస్పెండ్ చేయాలంటూ గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గురు మహిళా ఉద్యోగులు స్థానిక ఎండీఓ కు ఫిర్యాదు చేశారు. కర్లపాలెం వీఆర్వో అయిన డి. జాన్ విక్టర్ కుమార్ తమపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని మహిళా పోలీస్ డి. సౌందర్య, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ భ్రమరాంభదేవి మండల పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 19వ తేదీన ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదాలకు ఇవ్వాల్సిన రేషన్ పంపిణీ చేస్తున్న క్రమంలో వీఆర్వో తమ గురించి అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైన వాళ్లైతే ఇంట్లోనే ఉంటారు. పెళ్లికాని వారు ఇలా తిరుగుతారంటే నోటికొచ్చిన బూతులు తిట్టారు. మహిళా వాలంటీర్లపై ఇలా మాట్లాడటం ఇదేమీ కొత్తకాదని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు.
Also Read : రష్మిక మందన్న క్వారంటైన్ ఫొటోలు
అంతా తిట్టేశాక '' రేపటి నుంచి మళ్లీ మీరు నాకిందే విధులు నిర్వహించాల్సి ఉంటుంది..ఎలా నిర్వహిస్తారో నేనూ చూస్తా, నాకు రాజకీయ అండదండలున్నాయి, నన్ను ఎవరూ ఏం చేయలేరు '' అని బెదిరించినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తి కింద తాము విధులు నిర్వహించలేమని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్వో తమపై దుర్భాషలాడినందుకు అతనిపై చర్యలు తీసుకునేంత వరకూ విధులకు హాజరు కాబోమని తెలిపారు.
Also Read : పాయల్ పేపర్ డ్రస్..అవుట్ ఫిట్ ఫొటోస్