కోతుల బెడదను వదిలించుకోడానికి పోలీసుల మాస్టర్ ప్లాన్..!

By అంజి  Published on  6 Feb 2020 6:14 AM GMT
కోతుల బెడదను వదిలించుకోడానికి పోలీసుల మాస్టర్ ప్లాన్..!

మిత్రుడికి.. మిత్రుడు శత్రువు అంటారు..! అది కోతుల విషయంలో కూడా నిజమేనని అర్థం చేసుకోవచ్చు. కోతులు విపరీతంగా ఇబ్బందులు పెట్టే ప్రాంతాల్లో కొన్ని కొన్ని సార్లు కొండముచ్చులను తీసుకుని వస్తూ ఉంటారు రైతులు. అలా కొండముచ్చులను తీసుకొని వచ్చాక కోతులు అక్కడి నుండి పారిపోతూ ఉంటాయి.. అంతేకాకుండా అక్కడికి మరోసారి రావాలన్నా జంకుతూ ఉంటాయి. ఈ ఫార్ములాను కరెక్ట్ గా వాడింది కరీంనగర్ పోలీసు డిపార్ట్‌మెంట్‌!

కరీంనగర్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉన్న అర ఎకరాలో 12,000 మొక్కలు నాటారు. వీటిని గమనించిన కోతులు ఆ ప్రాంతంలోకి వచ్చి మొక్కలను, అంటులను నష్టపరచడమే పనిగా పెట్టుకున్నాయి. ఎంత సేపు మనుషులను కాపలాగా పెట్టి కోతులను తోలుతూ ఉంటారు చెప్పండి... ఇక చేసేది లేక రెండు వారాల క్రితం కొండముచ్చులను అక్కడి తీసుకొని వచ్చారు. వాటిని చూడగానే కోతులు అక్కడి నుండి పారిపోయాయి. ఈ ప్లాన్ ఏంటో వర్కౌట్ అయ్యిందని భావించిన పోలీసులు.. కొండముచ్చుల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కోతుల బెడద బాగా తగ్గిపోయిందని.. గత పదిరోజులుగా ఆ ప్రాంతంలో కోతుల సంచారం భారీగా తగ్గిందని అక్కడ పనిచేసే ఓ అధికారి వెల్లడించారు.

Next Story
Share it