రెండో రోజు కాపు విదేశీ విద్య దీవెన సర్టిఫికెట్ల పరిశీలన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2019 2:04 PM ISTవిజయవాడ: కాపులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా చెప్పారు. ప్రతి ఏడాది రూ.2వేల కోట్లు వైఎస్ జగన్ కేటాయిస్తున్నారని చెప్పారు. కాపుల అభ్యున్నతికి సీఎం కట్టుబడి ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కాపులు జగన్‌కు అండగా నిలబడ్డారని జక్కవపూడి రాజా చెప్పారు. చంద్రబాబు కాపులను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్లలో కాపులకు రూ.17 వందల కోట్లు కేటాయిస్తే..వైఎస్ జగన్ మొదటి ఏడాదే రూ.2వేల కోట్లు కేటాయించారని తెలిపారు. 'కాపు విదేశీ విద్య దీవెన పథకం 'కు రూ.100 కోట్లు కేటాయించారన్నారు.
Next Story