డ్రగ్స్‌కి అడిక్ట్‌ అయ్యానన్న కంగనా.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2020 11:55 AM IST
డ్రగ్స్‌కి అడిక్ట్‌ అయ్యానన్న కంగనా.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌లో 99 శాతం మంది సెలబ్రిటీలు డ్రగ్స్‌ తీసుకుంటారని నటి కంగనా రనౌత్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర సర్కార్‌, కంగనాకు మధ్య యుద్దమే నడుస్తుంది. గతంలో నటుడు అధ్యాయన్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కంగన డ్రగ్స్‌ తీసుకుంటుందని ఆరోపించాడు. అతడు చేసిన ఆరోపణల ఆధారంగా డ్రగ్స్‌ కేసులో కంగనను విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. డ్రగ్స్‌ తీసుకునేవారితో తనకి ఎలాంటి సంబంధాలు లేవని.. ఒక వేళ ఉన్నాయని నిరూపిస్తే.. ముంబయి వదిలి వెళ్లిపోతానని ఇటీవల కంగనా ట్వీట్‌ చేసింది.

తానూ డ్రగ్ అడిక్ట్ నే అని కంగనా ఒప్పుకున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో మనాలీ లోని తన ఇంట్లో మాట్లాడిన ఓ నాలుగు నిమిషాల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఏంముందంటే..? హీరోయిన్‌ కావాలనే ఆశతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చానని చెప్పింది కంగనా. ఆతరువాత కొద్ది కాలానికి తాను సినీ నటిగా ఎదిగానని.. ఆ సమయంలోనే డ్రగ్స్‌కి బానిసయ్యాను అని చెప్పారు. 'నా జీవితంలో ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొన్నాను, ఎంతోమంది చేతిలో దాదాపు మోసపోయాను' అని ఆమె తెలిపింది. ఇదంతా ఎలా ఉన్నా డ్రగ్స్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలే ముఖ్యమయ్యాయి. ఈ వీడియోపై నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు. కంగనా మీరు డ్రగ్స్‌ తీసుకుంటారా..? అని కొందరు కామెంట్‌ చేయగా.. ఈ వీడియో వల్ల మీకు ఇబ్బందులు రావొచ్చు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Next Story