'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సెకండ్ ట్రైలర్‌లో ఏముంది..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 2:01 PM ISTసంచలన దర్శకుడు వర్మ తీస్తున్న చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఏపీ రాజకీయాల చుట్టూ ఈ సినిమా కథ తిరగనుంది. ఇప్పటికే ట్రైలర్ వన్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. రెండో ట్రైలర్ ఈ రోజు విడుదల చేశాడు వర్మ. రాజకీయాలే పరమావధిగా బతికే ఇద్దరు నాయకులు చుట్టూ వర్మ కథ రాసుకున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి రావడం..రాజకీయాల్లో చినబాబు పాత్ర. ఆయన కోటరీ ..తన కుమారుడ్ని రాజకీయంగా నిలబెట్టడానికి చంద్రబాబు చేసే ప్రయత్నం, వేసే ఎత్తులు అన్నీ కూడా వర్మ ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తారని అభిమానులు అంచనావేస్తున్నారు. ట్రైలర్ 1, ట్రైలర్ 2ల్లో వర్మ చంద్రబాబు, చినబాబు క్యారక్టర్లనే బాగా హైలెట్ చేశారు.
విజయవాడ అంటేనే కమ్మ, కాపు అడ్డా. కమ్మ, కాపు గడ్డలోకి రెడ్లు ఎలా అడుగు పెట్టారు..? రెడ్లు ఎలా రాజ్యాన్ని ఏలుతున్నారు?. వారి రాజ్యాన్ని పటిష్టం చేయడానికి రెడ్లు ఎటువంటి ఎత్తులు వేస్తూ..పావులు కదుపుతున్నారనేది వర్మ ఈ సినిమాలో కచ్చతమైన అంచనాతో చూపించే అవకాశముంది.
ఇప్పటికే ట్రైలర్ 1తోపాటు 'పప్పులాంటి అబ్బాయి' సాంగ్ దుమ్మురేపింది. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ సృష్టించింది.
చంద్రబాబు పాత్రను క్రూరంగా పక్కా పొలిటీషియన్‌గా చూపిస్తే...వైఎస్ జగన్ పాత్ర ఆవేశపూరితమైన సీఎం పాత్రలో చూపించారు వర్మ. మనవడితో చంద్రబాబు ఆడుకోవడం ఇమేజ్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.
ఇక...బెజవాడలో అల్లర్లు కూడా ఈ సినిమాలో బాగా హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. రెడ్ల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన ప్రత్యర్దులు పన్నిన కుట్రగా దీనిని స్టోరీలొ వర్మ చొప్పించి ఉండొచ్చు. ఇక..రెండో ట్రైలర్‌లో టీడీపీ అంతర్గత సమావేశంలో ఓ టీడీపీ నేత పాత్రధారి "ఆ పొట్టోడు పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటాడు" అనే డైలాగ్ చంద్రబాబులో అంతర్గతంగా ఉన్న భయాన్ని వర్మ చూపించడానికి ఆ మాట అనిపించి ఉండొచ్చు.
ఇక..పవన్ కల్యాణ్ క్యారక్టర్ కూడా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఇంట్రస్ట్ లేపుతుంది. ప్రజల కోసం సినిమాలు వదిలేసుకున్నానని పవన్ కల్యాణ్ క్యారక్టర్‌తో వర్మ చెప్పించాడు. అంతేకాదు..పవన్ కల్యాణ్ క్యారక్టర్‌కు సంబంధించి కొన్ని ఇమేజ్‌లు కూడా ట్విట్ చేశాడు. కొంత మంది టాలీవుడ్ తారలు ప్రచారంలో కూడా పవన్ కల్యాణ్ చుట్టూ ఉండటం ఇంట్రస్టింగ్‌గా ఉంది.
మొత్తానికి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయింది. ఈ సినిమా ట్రైలర్‌కు , ఇమేజ్‌లకు పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో వర్మ తన బుర్రకు మరింత పదును పెట్టాడు. 'రెడ్ల రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' సినిమా తీస్తానంటూ ట్విట్ చేశాడు వర్మ. సంచలన దర్శకుడు వర్మ క్రియేటివిటి, తెగింపు చంద్రబాబుకు రాజకీయంగా తలనొప్పులు తెస్తున్నాయనడంలో సందేహం లేదు.
�
�
�