కామారెడ్డి జిల్లా: మంజీరా నది లో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న తల్లితో సహా ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ పోలీసులు కాపాడారు. పిట్లం కు చెందిన సాయవ్వ తన ఇద్దరు కొడుకులు వంశీ(10), విష్ణు తేజ (7) లతో మంజీరా నదిలో దూకి ఆత్మహత్య కు ప్రయత్నిస్తుండగా పోలీసులు సకాలంలో కాపాడారు. తాను, పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సాయవ్వ చెప్పింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ చిన్న పూల్ దగ్గర ఘటన చోటు చేసుకుంది.