తెరకెక్కనున్న కాళోజి జీవిత చరిత్ర

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 5:31 AM GMT
తెరకెక్కనున్న కాళోజి  జీవిత చరిత్ర

తెలంగాణ ఉద్యమకారుడు, మహాకవి కాళోజి నారాయణ రావు జీవిత చరిత్ర కథాంశంగా చలన చిత్రం రానుంది. ప్రభాకర్ జైనీ దరకత్వంలో కాళోజి నారాయణరావు గారి బయోపిక్ ‘కాలన్న’ చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాళోజీ జయంతి సందర్భంగా, దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ ఈ ప్రకటన చేశారు. కాళోజి దృష్టికోణం, తెలంగా రాష్ట్రం

కోసం ఆయన పడిన శ్రమ ఇవన్నీ కూడా సినిమాలో చూపిస్తారు. కాళోజి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

నవలా రచయిత, సామాజికవేత్త శ్రీప్రభాకర్ జైని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు, ఆయన భార్య శ్రీమతి విజయలక్ష్మి జైని ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మిచనున్నారు. ఇది వరకు ‘అమ్మా! నీకు వందనం!’; ‘ప్రణయవీధుల్లో.. పోరాడే ప్రిన్స్’; ‘క్యాంపస్-అంపశయ్య’ వంటిమూడు సినిమాలకు దర్శకత్వం వహించారు ప్రభాకర్ జైని.

ఈ సందర్భంగా దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ”కాళోజీ నారాయణ రావు గారి రచనలను, ఆయన స్వాతంత్య్ర పోరాట విశేషాలనునేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరముంది అన్నారు. మన సాంస్కృతిక పునరజ్జీవనానికి హారతి పట్టిన వారి విశేషాలు చెప్పాల్సిన అవసరముందన్నారు".

ఈ బయోపిక్ కు సంబంధించిన ప్రిలిమినరి ప్రొడక్షన్ పని ప్రారంభించామన్నారు నిర్మాత విజయలక్ష్మి జైనీ. కాళోజికి సంబంధించిన అనేక దస్తావేజులు, ఫొటోలు , సూత్రప్రాయంగా ఒక స్టోరీ లైన్ ను అనుకున్నామన్నారు.

1914లో వరంగల్ లో జన్మించి, 1992 లో పద్మ విభూషన్అందుకున్న కాళోజీ నవంబర్ 3, 2002 లో మరణించారు. తెలుగులోనేకాకుండా ఉర్దూ, మరాఠీ, హిందీ భాషల్లో కూడా కాళోజీ తన కవిత్వాన్ని అందించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవడాక్టరేట్ కూడా అందుకున్నారు కళోజి.

Next Story
Share it