త్రిష ప్లేస్‌లో కాజల్‌ బ్యూటీ..!

By సుభాష్  Published on  14 March 2020 6:28 PM IST
త్రిష ప్లేస్‌లో కాజల్‌ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' మూవీ నుంచి హీరోయిన్‌ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్‌ డిఫరెన్స్‌ స్‌ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు త్రిష సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. పాత్ర విషయంలో సంతృప్తి లేకపోవడంతోనే ఆమె మూవీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో ఇప్పుడు మరో హీరోయిన్‌ను సంప్రదించే పనిలో పడింది చిత్రయూనిట్‌. ఈ క్రమంలో మూవీ నిర్మాతలు కాజల్‌ను కలిశారట. ఆమెతో సంప్రదింపులు జరపడంతో నటించేందుకు అంగీకరించినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ నెలాఖరులో కాజల్‌ ఆచార్య సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. కాగా, త్వరలో అధికారికంగా ప్రకటన చేయనుంది చిత్ర యూనిట్‌.

దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌ రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్‌.150లో కాజల్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కాగా, అదే సెంటిమెంట్‌తో మరోసారి కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమేతే కాజల్‌కు మరోసారి బంపరాఫర్‌ వచ్చినట్లే. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రగా రామ్‌ చరణ్‌ నటిస్తుండగా, మహేష్‌ బాబు కూడా నటిస్తున్నారనే వార్తలు ఇటీవల ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. కాగా, కొనిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నారు.

Next Story