కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు కదా..అందుకే పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే ఉండి లాక్ డౌన్ డేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో చేస్తుందో తెలుసా..సమోసా తయారు చేసిందట, అదీ మొదటిసారి.

Also Read : ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలన్న మునిసిపల్ కమిషనర్..సస్పెండ్ చేసిన ప్రభుత్వం

మొదటిసారి నేను సమోసా తయారు చేశా. అదీ పంజాబీ స్టైల్ సమోసా. ఎలా ఉందో చెప్పండంటూ ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేసిందీ కలువకళ్ల సుందరి. కాజల్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. గుండెలో గుండె, అరె అర్జెంట్ గా దాచుకున్న పైసలన్నీ తీయండ్రా..సమోసా షాప్ పెట్టాలంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కాజల్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరికి లేదా..వచ్చే ఏడాదికి విడుదల కానుంది.

రాణి యార్లగడ్డ

Next Story