ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలన్న మునిసిపల్ కమిషనర్..సస్పెండ్ చేసిన ప్రభుత్వం

By రాణి  Published on  10 April 2020 9:40 AM GMT
ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలన్న మునిసిపల్ కమిషనర్..సస్పెండ్ చేసిన ప్రభుత్వం

  • నగరి మునిసిపల్ కమిషనర్ సెల్ఫీ వీడియో వైరల్

కరోనా వైరస్ ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తమకు మాస్కులు, గ్లౌజులు, పీపీఈ లను కూడా అందించడం లేదంటూ సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.

'' ఒక్క ఎమ్మెల్యే రోజా మాత్రమే అన్ని విధాలా, అన్ని డిపార్ట్ మెంట్ల సిబ్బందికి సహకరిస్తున్నారు. మిగతా చోట్ల మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, రాజకీయనాయకులు, భూ స్వాములు, ధనవంతులు ఇలా ప్రతిచోటా వీరంతా తమకు తోచిన సహాయాన్నందిస్తున్నారు. కానీ నగరి పట్టణంలో ఒక్కరు కూడా సహాయం అందించడం లేదు. ఇక్కడ నాలుగు కరోనా కేసులను ధృవీకరించారు. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే రోజా ఐదు మండలాల్లో వారికి భోజన సదుపాయాలు కల్పించకపోతే వారి పరిస్థితి ఏమయ్యేదో ? ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు. ఎక్కడైనా ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలి. స్త్రీ నే అయినా ధైర్యంగా ముందడుగేశారు ఎమ్మెల్యే రోజా. మిగతా నాయకుల జాడ కనిపించడం లేదు. మాకు ఒక్కరూపాయి రాలేదు. పైగా అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేశారు.

Also Read : నీళ్లనుకొని శానిటైజర్ తాగిన అధికారి

వీధుల్లో తిరుగుతున్న మాకోసం ఎలాంటి సేఫ్టీ సదుపాయాలు కల్పించలేదు. అయినా పోతున్నాం. ఇవన్నీ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో పంపుతున్నా'' అని మునిసిపల్ కమిషనర్ తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దీనిపై సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. నర్సీపట్నం వైద్యుడు కూడా ఇదే తరహా ఆరోపణలు చేయగా..అతడిని కూడా విధుల నుంచి తప్పించింది ఏపీ ప్రభుత్వం.

Next Story