గత రాత్రి(బుధవారం) భారతీయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో క్రేన్ కూలి ముగ్గురు వర్కర్లు మరణించారు. ఈ ప్రమాదంపై కథానాయిక కాజల్ అగర్వాల్ స్పందించింది. కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన నటిస్తోంది. తన సహచరులను కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. సహాయ దర్శకుడు కృష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్లు మధు, చంద్రన్ మృతి పట్ల సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ..కాజల్ ట్వీట్ చేసింది.

‘ఆ ప్రమాదం షాక్‌ నుంచి నేనింకా తేరుకోలేకపోతున్నా.. ఇదంతా కొద్ది క్షణాల గ్యాప్‌లోనే జరిగిపోయింది. అదృష్టవశాత్తూ నేను ఆ పెను ప్రమాదంనుంచి తప్పించుకున్నా.. ఆ క్షణంలో నాకు జీవితం విలువ, కాలం విలువ తెలిసి వచ్చింది. నా సహచరులను కోల్పోవడం నాకు బాధగా ఉంది.. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి.” అని రాసింది.

ఇండియన్ 2 హీరో, లైకా ప్రొడక్షన్ అధినేత కమల్ హాసన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. షూటింగ్ స్పాట్ లో క్రేన్ క్రాష్ అయి ముగ్గురు అక్కడిక్కడే చనిపోవడంపై ఆయన దిగ్ర్భాంతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. షూటింగ్ లలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తపడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు తలో కోటి రూపాయలు సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే మూడు కుటుంబాలకు అండగా ఉంటానని కమల్ పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన మరో 10 మందిని చెన్నై సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.