చీరకట్టులో చందమామ.. పెరిగిన కుర్రకారు హాట్ బీట్
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 2:14 PM GMTచందమామ అందాన్ని ఏమని వర్ణించాలి. సొగసరి అందాన్ని పూల తీగ అల్లుకున్న చందంగా ఆ చీర ఎంత ఒద్దికగా కుదిరిందో కదూ. పింకు బ్లౌజు.. కాంబినేషన్ వంగపువ్వు రంగు డిజైనర్ అంచు.. ఆ బాటమ్ మొత్తం కవర్ చేస్తూ ఉన్న చక్కని ప్రకృతి కళాకృతి.. ఆహా అనిపించడం లేదూ? ఎర్ర ఎర్రని పూలు.. షైనీ బ్లూ ఆకులు రెమ్మలు ఆహా అనిపిస్తున్నాయ్. ముద్దుగుమ్మ ఇలా ఒక్కసారిగా చీరలో కనిపించేసరికి కుర్రాళ్ల హార్ట్‌బీట్ కూడా సడన్‌గా పెరిగిపోయింది
కాజల్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. మరోవైపు కాజల్ నటించిన పారిస్ పారిస్ (క్వీన్ రీమేక్) రిలీజ్ కి నోచుకోకుండా పెండింగులో ఉంది.
Next Story