చిత్తూరు : విశ్రాంత‌ ఐఏఎస్, కుప్పం వైసీపీ ఇన్‌చార్జ్ చంద్ర‌మౌళి కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. గ‌త కొంతకాలగా ఆయ‌న క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతూ.. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆయ‌న.. ఐఏఎస్ ని విడిచిపెట్టి 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

2014, 2019 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై పోటీ చేశారు. టీడీపీ కంచు కోట అయిన కుప్పంలో.. 2014 ఎన్నికల్లో 55 వేల ఓట్లు, 2019 ఎన్నికల్లో సుమారు 70 వేల ఓట్లు సాధించి అందరి దృష్టి ఆక‌ర్షించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.