మాజీ మంత్రి జవ్వాడి రత్నాకర్‌రావు మృతి

By సుభాష్  Published on  10 May 2020 7:16 AM GMT
మాజీ మంత్రి జవ్వాడి రత్నాకర్‌రావు మృతి

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీరియర్‌ నేత జువ్వాడి రత్నాక్‌రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు. మూడుసార్లు బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందిన రత్నాకర్‌రావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రాజకీయ ప్రస్థానం:

రత్నాకర్‌రావు తిమ్మాపూర్‌ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.1982లో జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1982లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి ఓటమిపాలయ్యాడు. 1989లో పార్టీ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బుగ్గారం నుంచి మొదటిసారిగా విజయం సాధించారు. 1994లో ఓటమి పాలై, 1999,2004లో బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2010లో కోరుట్ల నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలక దూరంగా ఉంటూ వస్తున్నారు.

Next Story