అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2019 12:58 PM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం.!

తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి వారికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హోం మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. తెలంగాణ‌ అగ్రిగోల్డ్ కేసు హైకోర్టు పిటిషనర్ ఆండాళు రమేష్ బాబు నేడు హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.

ఈ విష‌య‌మై హోం మంత్రి స్పందిస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ వాటిని కొన్నప్పుడు ఎకరా లక్షల్లో ఉంటే ఈరోజు వాటి ధర కోట్ల రూపాయలకు పెరిగిందని అన్నారు. బాధితులందరికి తప్పకుండా డబ్బులు వస్తాయని ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అక్కడి బాధితులకు డబ్బుల పంపిణీ జరుగుతున్న విషయం తమకు తెలుసని, న్యాయపరంగా కూడా తాము సమీక్ష చేసి తమ ప్రభుత్వం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. హోం మంత్రిని కలిసిన వారిలోతెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల‌ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు సువ్వారి రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it