ఢిల్లీ: సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయి తన చివరి పనిదినమును ప్రత్యేకంగా ముగించుకున్నారు. తన నేతృత్వంలో విచారణలో ఉన్న పిటిషన్లన్నింటిని ఒకే సారి నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా జస్టిస్‌ తన చివరి పని దినమును చాలా ప్రత్యేకంగా ముగించుకున్నారు.

కాగా.. నవంబర్‌ 17న జస్టిస్ రంజన్‌ గొగొయి చివరి పని దినము. కానీ.. శని, ఆదివారాలు సెలవు దినములు రావడంతో.. ఆయన ఇవాళ తన చివరి పనిదినమును ముగించుకోనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ రంజన్‌ గొగొయికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున జస్టిస్‌ రంజన్‌ గొగొయి సాయంత్రం అందరికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.