నిర్భయ దోషుల ఉరిపై స్పందించిన ప్రధాని మోదీ

By సుభాష్  Published on  20 March 2020 7:10 AM GMT
నిర్భయ దోషుల ఉరిపై స్పందించిన ప్రధాని మోదీ

ఢిల్లీలోని తీహార్‌ జైల్లో నలుగురు నిర్భయ దోషులకు ఉరి తీశారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జైలు నెంబర్‌ 3లో దోషులను 30 నిమిషాల పాటు ఉరి కంబానికి వేలాడదీశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ''చివరికి న్యాయమే గెలిచింది. మన నారీమణులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి భద్రతతో పాటు మరింత గౌరవాన్ని పెంచాల్సిన అవసరముంది.

అన్ని రంగాల్లో సమానత్వం, అవకాశాల కల్పన ఎంతో ముఖ్యం. మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'' అని పేర్కొన్నారు. మరో వైపు నిర్భయ దోషులకు ఉరి అమలుపై కేంద్ర మత్రి స్మృతి ఇరానీ స్పందించారు. దోషులకు శిక్ష అమలులో ఆలస్యమైనప్పటికీ ఉరి శిక్షపడటం సంతోషంగా ఉందన్నారు. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్నారు.

Next Story