లాగే కొద్దీ కదులుతున్న ఈఎస్‌ఐ స్కామ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 7:18 AM GMT
లాగే కొద్దీ కదులుతున్న ఈఎస్‌ఐ స్కామ్

హైదరాబాద్‌: ఈఎస్‌ఐ ఐఎమ్‌ఎస్‌ స్కామ్‌లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎమ్‌ఎస్‌ విభాగంలో మందుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరగడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐఎమ్‌ఎస్‌ డైరెక్టర్‌ దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తేజ ఫార్మా కంపెనీ రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి పేటరి రెండు షెల్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల పేరిట డైరెక్టర్‌ దేవికా రాణి, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి కోట్ల రూపాయాలు దండుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీల పేరిట నొక్కేసిన డబ్బుతో దేవికా రాణి రూ.3 కోట్ల మేర విలువైన బంగారం కోన్నట్టుగా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇప్పటికే ఈ కేసులో 20 మంది నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్‌ఐ సిబ్బందితో పాటు పలువురు ప్రైవేట్‌ మెడికల్‌ ఏజెన్సీల ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏసీబీ దాడులలో దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు సంపాదించారు.

Next Story