జూనియ‌ర్ యువీ మెరుపులు వృథా.. టీమిండియా ఘోర ప‌రాజ‌యం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 7:14 AM GMT
జూనియ‌ర్ యువీ మెరుపులు వృథా.. టీమిండియా ఘోర ప‌రాజ‌యం..!

విండీస్‌తో జ‌రిగిన‌ రెండో టీ20లో టీమిండియా ఓడింది. నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో కోహ్లీ సేన‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో స‌మం చేసి పైన‌ల్ ఉత్కంఠ‌కు తెర‌లేపింది. టాస్ గెలిచిన విండీస్‌.. భారత్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాపార్డ‌ర్ వైఫ‌ల్యం చెంద‌డంతో టీమిండియా.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది.

దేశ‌వాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన‌.. శివమ్‌ దూబే (30 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించ‌గా.. చివ‌ర్లో పంత్‌ (22 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించ‌డంతో టీమిండియా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన విండీస్‌.. ఓపెన‌ర్‌లు ఇద్ద‌రూ శుభారంభం ఇవ్వ‌డంతో.. 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. ఓపెన‌ర్‌ సిమన్స్‌ (45 బంతుల్లో 67 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విండీస్ ను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. మ‌రో ఓపెన‌ర్ లూయిస్‌ (35 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.

Next Story
Share it