దుబాయ్‌లో సీనియర్ - జూనియర్ క‌లిశారు.. ఏం చేశారంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Dec 2019 6:59 AM GMT
దుబాయ్‌లో సీనియర్ - జూనియర్ క‌లిశారు.. ఏం చేశారంటే..!

టీమిండియా యువ వికెట్ కీప‌ర్ రిషభ్‌ పంత్‌ ఈ సారి క్రిస్మస్ వేడకులను టీమిండియా మాజీ సార‌థి, సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్ ధోనీతోతో కలిసి జరుపుకున్నాడు. ప్రస్తుతం ఈ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. క్రికెటర్‌ ఎంఎస్ ధోనీ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ కోసం దుబాయ్‌ వెళ్లాడు. ధోనీతో పాటు టీమిండియా యువ సంచ‌ల‌నం పంత్‌, ధోనీ స్నేహితులు కూడా దుబాయ్ వెళ్లి క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను తెగ ఎంజాయ్‌ చేశారు.వీరిద్ద‌రి ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు 'జూనియర్‌ అండ్‌ సీనియర్‌ ఎట్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్' అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ధోనీ, రిష‌బ్ పంత్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రసుతం టీమిండియాకు దూరంగా ఉన్న ధోనీతో పంత్‌ తరుచూ కలుస్తున్నాడు. ధోని కుటుంబంతో సాన్నిహిత్యం అలాగే.. ఆట పరమైన టెక్నిక్‌లు తెలసుకోవడానికి ఈ జూనియర్‌ క్రికెటర్ ధోనీని కలుస్తున్నాడని వారిద్దరి స్నేహితులు అంటున్నారు.Next Story
Share it