ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
By సుభాష్
ఈనెల 16వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. 16న ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి లో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, 16న జరిగే సమావేశాల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే 18న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇది చదవండి: ఏపీలో లాక్‌డౌన్ పొడిగిస్తూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 31తో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. ఇక అలాగే సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణతో పాటు మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు