పత్రికా విలేకరి హత్యను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2019 9:23 PM ISTతుని: ఎస్ అన్నవరం వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఆంధ్రజ్యోతి తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణను దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తితో నరికి దుండగులు పరారయ్యారు. హత్యల ద్వారా పాత్రికేయుల గొంతు నొక్కాలని చూస్తే..మరింత పట్టుదలతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పని చేస్తామన్నారు జర్నలిస్ట్‌లు . సత్తిబాబు కుటుంబానికి రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరపున పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశాయి జర్నలిస్ట్ సంఘాలు.
సీరియస్‌గా తీసుకున్న సీఎం వైఎస్ జగన్
పత్రికా విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని సీఎం జగన్ ..డీజీపీని ఆదేశించారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడారు. తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ ఆదేశించారు. జర్నలిస్ట్‌ను హత్య చేయడం దారుణమైన ఘటనగా డీజీపీ అభివర్ణించారు. కేసును స్వయంగా పర్యవేక్షించి నిందితులను పట్టుకోవాలంటూ తూ.గో.జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు.