Fact Check : కరోనానుంచి కోలుకొని వచ్చిన వ్యక్తి తుపాకీ తూటాకు బలయ్యాడా ? ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగిందా ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 April 2020 3:06 AM GMT
Fact Check : కరోనానుంచి కోలుకొని వచ్చిన వ్యక్తి తుపాకీ తూటాకు బలయ్యాడా ? ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగిందా ?

సోషల్ మీడియాలో కరోనాకు సంబంధించిన తప్పుడు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దేశంలో జరిగిన దాన్ని మరో దేశంలో జరిగినట్లు, సంబంధం లేకపోయినా కరోనాతో లింకు పెట్టడం వంటివి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

P3 Copy

ఇదే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. ఒక వ్యక్తి బ్లూరంగు కారులో వచ్చి దిగాడు. మరో వ్యక్తి అతను తిరిగి వచ్చాడన్న సంతోషంలో రివాల్వర్ తో గాలిలోకి కాల్పులు జరుపుతూ ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో రివాల్వర్ నుంచి బయటకు వచ్చిన ఓ తూటా అదుపుతప్పి ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి తలలోకి దూసుకుపోయింది. దీంతో.. ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

[video width="320" height="580" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/VXWSND_XvKXoWMtT.mp4"][/video]

అయితే.. కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన ఓ నాయకుడికి అతని కొడుకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోయాడని, అది వికటించి గన్ మిస్ ఫైర్ అయి ఆ వ్యక్తి చనిపోయాడని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఇది పాకిస్తాన్ లో జరిగిందంటూ వీడియోకు రైటప్ జోడించి ప్రచారం చేస్తున్నారు. చాలామంది ఈ వీడియోను, రైటప్ ను ఫార్వార్డ్ లు చేశారు.

అయితే.. ఈ వీడియో నిజమే కానీ, పాకిస్తాన్ లో జరగలేదు. ఇది జోర్డాన్ దేశంలో జరిగింది. జోర్డాన్ లోని అమ్రావా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ కేసులో శిక్ష అనుభవిస్తూ అధికారుల నిర్ణయంతో శిక్షాకాలం పూర్తికాకుండానే విడుదలయ్యాడు. అతని పేరు సేలం వార్దాత్. ఓ నేరం కింద ఎనిమిది నెలలుగా సేలం వార్దాత్ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే.. కరోనా వైరస్్ వ్యాప్తి నేపథ్యంలో జోర్డాన్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. అతని శిక్షాకాలం ఇంకా రెండు వారాలు ఉండగానే సేలం విడుదలయ్యాడు. అయితే.. సేలం వార్దాత్ ఇంటికి వచ్చాడన్న ఆనందంలో అతని బంధువు ఒకరు.. తన రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. అలా జరుపుతూండగా.. చివరి బుల్లెట్ అదుపు తప్పి సేలం తలలోనుంచి దూసుకెళ్లింది. దీంతో.. ఇంట్లోకి వెళ్లకుండానే సేలం ప్రాణాలు విడిచాడు. దీనికి సంబంధించి అల్ జజీరా తో పాటు పలు వెబ్ సైట్లలో వార్త ప్రచురితమైంది.

https://www.aljazeera.com/news/2020/04/jordan-man-killed-day-released-prison-200417121506809.html

ప్రచారం : పాకిస్తాన్ లో కరోనానుంచి కోలుకొని ఇంటికి వచ్చిన నాయకుడికి గ్రాండ్ వెల్ కమ్ చెబుతుండగా తుపాకీ తూటా తలలోకి దూసుకెళ్లి చనిపోయాడు.

వాస్తవం : జోర్డాన్ లో ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలై వచ్చిన సంతోషంలో అతని బంధువు గాల్లోకి కాల్పులు జరుపుతుండగా ఓ తూటా ఆ వ్యక్తి తలలోంచి దూసుకెళ్లి మరణించాడు.

కంక్లూజన్ : జోర్డాన్ లో జరిగిన సంఘటనను పాకిస్తాన్ లో జరిగినట్లు పేర్కొన్నారు. పైగా జైలునుంచి విడుదలై వచ్చిన వ్యక్తిని.. కరోనా నుంచి కోలుకొని వచ్చాడని తప్పుగా ప్రచారం చేశారు.

- సుజాత గోపగోని

Claim Review:Fact Check : కరోనానుంచి కోలుకొని వచ్చిన వ్యక్తి తుపాకీ తూటాకు బలయ్యాడా ? ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగిందా ?
Claim Fact Check:false
Next Story