అచ్చమైన రైతులా రైతు బజార్లోకి..వెళ్లిందెవరో తెలుసా ?
By రాణి Published on 31 March 2020 9:05 PM IST
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో ఏప్రిల్ 14వ తేదీ వరకూ దేశమంతా లాక్ డౌన్ లో ఉండాలని ప్రధాని ఆదేశించిన విషయం విధితమే. ఈ తరుణంలో రవాణా స్తంభించిపోయింది. ఫలితంగా నిత్యావసరాలైన కూరగాయలు రైతు మార్కెట్లకు చేరడం ఆలస్యమవుతోంది. దీంతో కొన్ని రైతు మార్కెట్లలో కూరగాయల ధరలు అందలాన్నంటాయి. ఈ మధ్యే అత్యవసర సర్వీసులకు లాక్ డౌన్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కూరగాయల ఎగుమతులు ముమ్మరమయ్యాయి. తత్ఫలితంగా పెరిగిన ధరలు మళ్లీ సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్నాయి.
Also Read : బెజవాడలో కరోనా లక్షణాలతో దంపతులు మృతి
అసలు కూరగాయలను ఎంతకు అమ్ముతున్నారు? ప్రభుత్వం సూచించిన ధరలకు విక్రయిస్తున్నారా ? లేక అధిక ధరలు వసూలు చేస్తున్నారా ? తెలుసుకోవాలనుకున్నారు విజయనగరం జాయింట్ కలెక్టర్. అనుకున్నదే తడవుగా మారువేషంలో రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లోకి ఎంట్రీ ఇచ్చారు మన జేసీ కిశోర్. మార్కెట్ లో అన్ని షాపులకు తిరిగి బేరాలాడుతూ నిత్యావసరాలను కొనుగోలు చేశారు. అంతా అయిపోయాక మార్కెట్లోకి పంచ కట్టి, కండువా వేసుకుని రైతులా వచ్చింది జాయింట్ కలెక్టర్ అని తెలుసుకున్న వ్యాపారులు ఖంగుతిన్నారు. మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయని మీడియా ప్రశ్నించగా ఉల్లి మాత్రం రూ.5 పెచ్చు అమ్ముతున్నారు..మిగతా ధరలన్నీ మామూలుగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Also Read : ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న రతన్ టాటా జీవిత చరిత్ర..