'ఆ' అభిమానిపై రెండేళ్ల నిషేదం

By Newsmeter.Network  Published on  14 Jan 2020 11:09 AM GMT
ఆ అభిమానిపై రెండేళ్ల నిషేదం

క్రికెట్ కానీ మ‌రేదైన క్రీడ‌ల్లో గాని ఆట‌గాళ్లు మైదానంలో హ‌ద్దులు దాటిన‌ప్పుడు వారి పై నిషేదం విధించడం చూస్తుంటాం. ఒక్కొసారి సెల‌బ్రేటీలు మైదానానికి రాకుండా నిషేదానికి గురైన సంఘ‌ట‌న‌లు చూశాం. తాజాగా ఓ క్రికెట‌ర్ పై అభ‌స్య వ్యాఖ్య‌లు చేసినందుకు ఓ క్రికెట్ అభిమాని పై నిషేదం విధించారు.

గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు ఆటలో ఆర్చర్‌పై ఆక్లాండ్‌కు చెందిన ఒక అభిమాని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తొలి రోజు మ్యాచ్ అనంత‌రం ఆర్చ‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా జ‌రిగిన ఘ‌ట‌న‌ను వెల్ల‌డించాడు. కాగా ఈ ఘ‌ట‌న‌పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధ్య‌క్షుడు త‌న అస‌హానాన్ని వ్య‌క్తం చేయ‌గా అప్ప‌ట్లో ఈ దీనిపై పెద్ద దుమార‌మే న‌డిచింది. న్యూజిలాండ్ జ‌ట్టు కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్‌, ఆ దేశ క్రికెట్ బోర్డు.. ఈ ఘ‌ట‌న‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీనితో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది.

ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆ అభిమానిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. ఎట్టకేలకు ఆక్లాండ్‌ చెందిన 28 ఏళ్ల వ్యక్తిగా గుర్తించిన న్యూజిలాండ్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ క‍్రమంలోనే అతనిపై రెండేళ్ల పాటు క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియాలకు రాకుండా నిషేధం విధించినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రతినిధి ఆంటోని క్రుమ్మీ తెలిపాడు. 2022 వరకూ అతనిపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు.

ఇక్కడ న్యూజిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడటానికి కానీ, దేశవాళీ మ్యాచ్‌లు చూడటానికి కానీ అతనికి అనుమతి ఉండదు. ఒకవేళ ఈ నిషేధ సమయంలో అతను మ్యాచ్‌లు చూడటానికి యత్నిస్తే యాక్షన్‌ తీవ్రంగా ఉంటుందని క్రుమ్మీ స్పష్టం చేశాడు.

Next Story
Share it