గుడ్‌న్యూస్‌.. తెలంగాణ ఆర్టీసీలో 3వేల నియామకాలకు కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. ఆర్టీసీలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  29 Jan 2024 6:58 AM GMT
tsrtc, 3000 jobs, minister ponnam, md sajjanar,

గుడ్‌న్యూస్‌.. తెలంగాణ ఆర్టీసీలో 3వేల నియామకాలకు కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. తెలంగాణ ఆర్టీసీలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీలో దాదాపు 3వేల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు ఈ మేరకు రవణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే.. జనవరి 31వ తేదీ వరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో 43వేల మంది పనిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత పదేళ్లుగా ఆర్టీసీ సంస్థలో కొత్త నియామకాలేవీ జరగలేదన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని చెప్పారు. కొత్తగా మూడువేల బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

ఇక ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇంతకుముందే సంస్థ ఎండీ సజ్జనార్ కూడా ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తోంది. దీని ద్వారా ఆర్టీసీలో బాగా రద్దీ పెరిగింది. కాగా.. ఈ రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్‌ బస్సులను వాడకంలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని బస్సులను కూడా కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఎండీ సజ్జనార్ చెప్పారు.

ఈ నేపథ్యంలో కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్ ఉంటుందని ఇప్పటికే సజ్జనార్ చెప్పారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందనిఅ న్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వీరంతా విధుల్లో చేరనున్నారని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ చెప్పారు.

Next Story