26,146 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులకు మూడ్రోజులే సమయం

దేశంలో కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుళ్ల భర్తీకి ఇదివరకే నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla
Published on : 28 Dec 2023 4:37 PM IST

ssc gd constable, jobs, application,  more three days,

26,146 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులకు మూడ్రోజులే సమయం

దేశంలో కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుళ్ల భర్తీకి ఇదివరకే నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. 26,146 కానిస్టేబుల్‌ (జీడీ) ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. అర్హులైనవారు ఆన్‌లైన్‌ https://ssc.nic.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. దరఖాస్తులకు ఇంకా మూడ్రోజుల సమమే ఉంది. ఈ నేపథ్యంలో త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అభ్యర్థులకు స్టాఫ్ సెలోన్ కమిషన్ ఈలక విజ్ఞప్తి చేస్తోంది. ఎట్టి పరిస్థితల్లో దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ పొడగింపు ఉండదనీ.. అందుకే దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్నారు.

ఇక కొందరు చివరి రోజు వరకు వేచి చూస్తుంటారు.. అలా చేయడం ద్వారా మీకే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ఒకేసారి దరఖాస్తులు వస్తే సర్వర్‌ సమస్యలతో పాటు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా త్వరపడి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కాగా.. పదో తరగతి విద్యార్హతతో కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో 26వేలకు పైగా కానిస్టేబుల్ (జీడీ) పోస్టు భర్తీకి నవంబర్‌లో SSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తులకు తుది గడువు డిసెంబర్‌ 31 వరకు, ఫీజు చెల్లింపునకు జనవరి 1 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 26,146 ఉద్యోగాలు కాగా.. పురుషుల కోసం 23,347, మహిళా కేటగిరీలో 2,799 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. బీఎస్‌ఎఫ్‌లో 6,174, సీఐఎస్‌ఎఫ్‌లో 11,025, సీఆర్‌పీఎఫ్‌లో 3337, ఎస్‌ఎస్‌బీలో 635, ఐటీబీపీలో 3189, ఏఆర్‌లో 1490, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 296 చొప్పున మొత్తంగా 26,146 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Next Story