ప్రభుత్వ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఖాళీలు.. లోక్‌సభలో వెల్లడించిన ఆర్థిక శాఖా మంత్రి
Nirmala Sitharaman says Over 41000 posts vacant at public sector banks.దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177
By M.S.R Published on 14 Dec 2021 1:01 PM ISTదేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో డిసెంబర్ 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఒక్క ఎస్బీఐలోనే గరిష్ఠంగా 8,544 ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉందని.. పీఎన్‌బీ(పంజాబ్ నేషనల్ బ్యాంకు) లో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్‌సీస్ లో 5,112, బీవోఐలో 4,848 ఖాళీలు ఉన్నాయని అన్నారు. లోక్‌సభకు సమర్పించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో మొత్తం 12 పీఎస్‌బీల్లో వివిధ స్థాయిల్లో 8,05,986 కుపైగా స్థానాలున్నాయని, ఇందులో ఆఫీసర్లు, క్లర్కులు, సబ్-స్టాఫ్ హోదాల్లో 41,177 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో సిబ్బంది కొరత పెద్ద ఎత్తునే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతుండటమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. 2016లో పంజాబ్-సింద్ బ్యాంక్‌లో ఒక పోస్ట్ మినహా PSBలలో గత ఆరేళ్లలో ఏ పోస్ట్/ఖాళీని రద్దు చేయలేదని కూడా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు వారి అవసరాలకు అనుగుణంగా కొనసాగుతున్న ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయడానికి సిబ్బంది నియామకాన్ని చేపడతాయని ఆమె తెలిపారు.
సోమవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభానికి ముందు, 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిలో మరణించిన ఎనిమిది మంది భద్రతా సిబ్బంది సహా తొమ్మిది మందికి లోక్‌సభ నివాళులర్పించింది. మృతులకు నివాళులర్పిస్తూ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. డిసెంబర్ 13, 2001న పార్లమెంట్ పై జరిగిన దాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరియు సిబ్బంది మరణించారు. దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు కూడా మరణించారు.