రైల్వేశాఖలో 5,696 ఉద్యోగాలు..దరఖాస్తులకు కొద్దిరోజులే సమయం
రైల్వేశాఖలో వివిధ జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ జరగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 4:29 PM ISTరైల్వేశాఖలో 5,696 ఉద్యోగాలు..దరఖాస్తులకు కొద్దిరోజులే సమయం
రైల్వేశాఖలో వివిధ జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ జరగుతోంది. 5,696 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అధికారులు. దీని కోసం దరఖాస్తుల గడువు దగ్గరపడుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉందని చెబుతున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ అర్దరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇక ఆఖరి నిమిషం వరకు వేచి చూసి ఇబ్బందులకు గురికాకుండా ముందుగానే అప్లై చేసుకోవడం మంచిదని సూచిచస్తున్నారు.
లోకో పైలట్ ఉద్యోగానికి విద్యార్హత:
అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే. ఇక ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
వేతనం:
అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి తొలుత రూ.19,900 నుంచి వేతనం మొదలు అవుతుంది. ఇతర సౌకర్యాలుంటాయి.
వయోపరిమితి:
2024 జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
* కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల్లో మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.