నిరుద్యోగ యువతకు శుభవార్త. పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 21 నుంచి 24 ఏళ్ల వయసు కలిగిన వారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలి. దీని ద్వారా టాప్ 500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6,000 ఇస్తారు. ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం, 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించబడింది. ఇది యువత ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో 5 సంవత్సరాల కాలంలో అగ్రశ్రేణి కంపెనీలలో 1 కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడానికి ఉద్దేశించబడిన ఒక సమగ్ర పథకం. ఈ పథకంలో చేరిన వారికి పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది.