జేఎన్‌యూలో దాడిని ఖండించిన సీఎంలు, రాజకీయ నాయకులు

By సుభాష్  Published on  6 Jan 2020 8:54 AM GMT
జేఎన్‌యూలో దాడిని ఖండించిన సీఎంలు, రాజకీయ నాయకులు

జేఎన్‌ యూలో చోటు చేసుకున్న హింసపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు సీఎంఎల, రాజకీయ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. దేశంలోదాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. విద్యార్థులపై జరిగిన ఈదాడి అసహనానికి నిదర్శనమని అన్నారు. జే ఎన్‌ యూ క్యాంపస్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులపై 'నాజీ తరహా'లో దాడి జరిగిందన్నారు. దేశంలో అల్లర్లు, హింసను సృష్టించాలంటే ఇలాంటి దాడులకు తెగబడతారా..? అంటూ సీఎం పినరయి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

విద్యార్థులకు ఓవైసీ మద్దతు

ఈ దాడుల నేపథ్యంలో క్యాంపస్‌ విద్యార్థులకు ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ సంఘీభావం తెలిపారు. ఇలాంటి దారులు చేయడం దారుణమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్విట్‌ చేస్తున్నారని, గుండాలకు పోలీసులు రక్షణ ఎందుకు ఉన్నారో మోదీ సమాధానం చెప్పాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. అలాగే ఈదాడులపై బీఎస్పీ అధినేత్రి మయావతి కూడా తీవ్రంగా ఖండించారు.

Next Story