జమ్ముకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్న్‌గా గిరీష్ చంద్ర ముర్మూ..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఢిల్లీ: అక్టోబర్ 31 దగ్గరకు వస్తుండటంతో కేంద్రం జమ్ముకశ్మీర్, లడఖ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జమ్ము కశ్మీర్ లెప్ట్ నెంట్ గవర్నర్ గా గిరీష్ చంద్ర ముర్మును నియమించింది. లడఖ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా రాధా కృష్ణ మాథూర్ ను నియమించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను గోవా పంపించారు. పీఎస్ శ్రీధరన్ పిళ్లైను మిజోరం గవర్నర్‌గా పంపారు.
ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రద్దు చేసిన జమ్ము కశ్మీర్, లడఖ్ లను విభజించి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అయితే..జమ్ముకశ్మీర్ కు అసెంబ్లీ ఉంటుంది. లడఖ్ కు అసెంబ్లీ ఉండదు. అక్టోబర్ 31 నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ లుక కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడతాయి. ఆ రోజు నుంచి రెండు చోట్ల విడివిడిగా పాలన జరుగుతుంది. అక్టోబర్ 31 దగ్గరకు వస్తుండటంతో మోదీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే జమ్ముకశ్మీర్, లడఖ్ లకు లెప్ట్ నెంట్ గవర్నర్ లను నియమించింది.
గిరీష్ చంద్ర ముర్మూ ఎవరు?
గిరీష్ చంద్ర ముర్మూ ఐఏఎస్ అధికారి. ఈయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆర్ధిక శాఖలో వ్యయ కార్యదర్శిగా ఉన్నారు. గుజరాత్‌కు మోదీ సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు కార్యదర్శిగా పని చేశారు. గిరీష్ చంద్ర ముర్మూ ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డాడు. అంతేకాదు..గుజరాత్‌లో కీలక పదవులు నిర్వహించిన వారిలో గిరీష్ చంద్ర ముర్మూ ఒకరు.
ఆగస్ట్ 9న విభజన చట్టాన్ని ఆమోదించిన కోవింద్
ఆగస్ట్ 9 నరాష్ట్రపతి కోవింద్ జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టానికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదించిన చట్టం ప్రకారం జమ్ముకాశ్మీర్‌కు 107 స్థానాలతో అసెంబ్లీ ఉంటుంది. డీలిమిటేషన్ తరువాత 114 స్థానాలు ఏర్పాటు అవుతాయి. కొంత భాగం పాక్ ఆక్రమించడంతో 24 స్థానాలుఖాళీగా ఉన్నాయి
ఒక్కటే హైకోర్ట్
జమ్ముకశ్మీర్ కు సంబంధిచి ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీ ఇవన్నీ కూడా ఎల్‌జీ నియంత్రణలో ఉంటాయి. ఇక..అక్టోబర్ 31 నుంచి జమ్ము, లడఖ్ యూటీలకు జమ్ముకశ్మీర్ హైకోర్ట్ సాధారణ మహైకోర్ట్ గా ఉంటుంది.
రాధాకృష్ణ మాధూర్ ఎవరు?
రాధాకృష్ణ మాదూర్ కూడా ఐఏఎస్ ఆఫీసరే. 1977 త్రిపుర కేడర్‌కు చెందినవారు రాధాకృష్ణ. 2018లో భారత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. రక్షణ కార్యదర్శిగా, త్రిపుర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. పరిపాలనలో అపార అనుభవం ఉన్న రాధాకృష్ణన్‌ను లడఖ్ ఎల్‌జీగా కేంద్రం నియమించింది.
పరిపాలనలో మంచి అనుభవం ఉన్న గిరీష్ చంద్ర, రాధాకృష్ణ లను జమ్ముకశ్మీర్, లడఖ్ లకు పంపడం ద్వారా అక్కడ పరిపాలనపై కేంద్రం దృష్టి పెట్టాలనే మెస్సేజ్ ను పంపింది. అందరూ ఐపీఎస్ అధికారులను పంపుతారని అనుకుంటే..కేంద్రం మాత్రం ఐఏఎస్ లను పంపింది.