రాష్ట్రానికి కొత్త లోగో.. ప్రభుత్వం నిర్ణయం
By సుభాష్ Published on 26 Jan 2020 3:32 PM ISTభారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త లోగోను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను సీఎం హేమంత్ సోరెన్ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. లోగో రూపకల్పనలో తమవంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు ఫిబ్రవరి 11వ తేదీలోగా ప్రజలు తమ సూచనలు, సలహాలను 'jharkhandstatelogo@gmail.com' కు తెలియజేయాలని సర్కార్ కోరింది.
ఇక ముఖ్యమంత్రిగా హేమంత్ భాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ సమావేశంలో ఈ కొత్త లోగో ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి కొత్త లోగోను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ సమున్నత సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉండబోతోందని హేమంత్ సర్కార్ పేర్కొంది.